getapujari.com logo
vinayakudu
narasimhaswamy
థి గ్రేట్ సప్తర్షి రిసేర్చింగ్ టీం | ఎవరితో ఎలా మాట్లాడాలి? | 56 అక్షరాల అక్షరమాల కవిత | గోవు వర్ణన | గరుడ గమన తవ చరణకమలమిహ | శ్రీ కృష్ణుని మేలుకొలుపు | మన పల్లె జీవనం - మన పల్లె సోయగం | శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా? | ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు | నక్షత్ర మంత్రాలు | శ్రీశైల రగడ (శ్రీశైల మానసిక యాత్ర) | దర్భ యొక్క ప్రాముఖ్యం | మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు? | ఏక వింశతి పత్రాలు | శ్రీ గురు రామాయణ సుధ
56 అక్షరాల అక్షరమాల కవిత << బాక్
రచయత: జంపని శ్రీనివాస మూర్తి గారు

అ మ్మలా  ఆదరిస్తుంది...
ఆ త్మీయతనే పంచుతుంది..
ఇ న్నేళ్ల మాతృభాష. .
ఈ తరం వారికి...
ఉ గ్గుపాలతో నేర్పలేకున్నాము..
ఊ అంటూ ఆంగ్లభాష తో...
ఋ షిలా తపస్సే చేస్తున్నారు..
ఎ క్కడ  వెతికినా..
ఏ దేశమేగినా..
ఐ క్యత తో మెలగమంటూ..
ఒ ద్దికగా  అక్షరాల...
ఓ నమాలనే దిద్దిస్తూ...
ఔ రా అని ఆశ్చర్యం కలిగేటట్లు..
అం దమైన జీవితాన్ని ఇస్తుంది. .
క మ్మనైన తెలుగు భాష..
ఖండ కావ్యమే  సాహిత్య ప్రియులకు...
గ గనాన జాబిలై ప్రకాశిస్తూ..
ఘ నత నంతటిని చాటుతుంది..
చ రక సంహిత గ్రంధాలనూ..
ఛ త్రపతి శివాజీ గాధలను..
జా నకి రాముల రామాయణాన్ని..
ఝ  (ఝాన్సీ) రాణీ వీరత్వమును..
టం గుటూరి ప్రకాశం మా ఆంధ్రుడేనంటూ..
ఠ(ఠాగూర్) జనగణమన జాతీయగీతమంటూ..
డ బ్బు డాబు మాకు లేదంటూ..
ఢ మరుకమే  మ్రోగిస్తూ..
జా (ణ) న పదాలను..
తం దాన తానా బుర్రకధలను..
థ కిట తధిమంటూ సరిగమలను..
ద మయంతీ నలభీమ పాకంలా ఊరిస్తూ..
ధ న పేద భావం లేదంటుంది...
న వ్వుల పువ్వులను పూయిస్తూ..
ప న్నీటి జల్లులే కురిపిస్తూ..
ఫ లంలా తియ్యని రుచినిస్తూ..
బంగారు తివాచీ పరిచి..
భ విష్యత్తును భావి తరలకూ అందిస్తుంది..
మ రుమల్లెల గంధాలతో పరిమళిస్తూ..
యంగ్ యమా సినిమాలా  డైలాగ్సతో..
రం జింప చేస్తూ..
ల ఘు నాటికల సినిమాలతో..
వ య్యారాల సత్యభామలా..
శ రాలనే మాటలనే వదులుతుంది..
ష ర్బత్ లా చల్లగా...
స ముద్రం లో దొరికే ముత్యంలా మెరుస్తూ..
హ మ్మ అంటూ ఆశ్చర్యపడేలా..
ళ తు (ళ్ళు)తూ,  గెంతులు వేస్తూ..
క్ష ణాలన్నిటా  నాలుక పై భీజాక్షరాలుగా..
సరస్వతీ దేవై కొలువుతీరుతుంది..
మన తేనెలొలుకు తెలుగు..
ఎందరో జీవితాలకు వెలుగు..


సూచన : మా ఈ వెబ్ సైట్ ద్వారా ఎన్నొ రకల మంచి విషయలను ఒకేచొట ప్రజలకు అందచేయలన్న సదుద్దేశ్యం తొ మాకు తెలిసిన, ఎందరో మహనుభవుల నుంచి తెలుసుకన్న, వివిధ రకల గ్రంధముల నుంచి సేకరించిన వివరాలను మీకు అందించటం జరిగింది. మాకు తెలిసిన వివరాలను సాధ్యమైనంత జాగ్రత్తగా పర్యవెక్షించి ఉంచుతున్నము, కాని ఇంకా ఎమైన కొత్త విషయలు చెర్చాలి అన్న, లెక ఉన్నవాటిలొ ఎమైన మార్పులు చెయాలి అన్న , మీ వ్యాఖ్యలు మేము గౌరవిస్తాము. మా "సంప్రదించండి" లింక్ ద్వారా వివరాలను తెలియచేయండి.

Ad Banner