getapujari.com logo
vinayakudu
narasimhaswamy
థి గ్రేట్ సప్తర్షి రిసేర్చింగ్ టీం | ఎవరితో ఎలా మాట్లాడాలి? | 56 అక్షరాల అక్షరమాల కవిత | గోవు వర్ణన | గరుడ గమన తవ చరణకమలమిహ | శ్రీ కృష్ణుని మేలుకొలుపు | మన పల్లె జీవనం - మన పల్లె సోయగం | శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా? | ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు | నక్షత్ర మంత్రాలు | శ్రీశైల రగడ (శ్రీశైల మానసిక యాత్ర) | దర్భ యొక్క ప్రాముఖ్యం | మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు? | ఏక వింశతి పత్రాలు | శ్రీ గురు రామాయణ సుధ
ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు << బాక్
arogya chitkaalu1

1. పిల్లల్లో చెవినొప్పి తరచుగా వస్తున్నట్లయితే అందుకు ప్రధాన కారణం చెవిలోపల శుభ్రం చేయకపోవడమే కావచ్చు. గులిమి గట్టిపడి శుభ్రం చేయడానికి సాధ్యం కాకుంటే వేడినీటిలో ఉప్పు కరిగించి డ్రాపర్‌తో చెవిలో నాలుగు చుక్కలు వేసి అప్పుడు దూదితో శుభ్రం చేయాలి.

2. పులిహొర తింటే కడుపు బరువుగా ఉన్నట్లు ఉంటుంది. ఆ బరువు తగ్గాలంటే ఒక చిట్కా ఉంది పులిహొర తిన్న వెంటనే - గోరు వెచ్చని నీరు ఒక గ్లాసుడు తాగేస్తే - తొందరగా జీర్ణం అవుతుంది. వేడి కూడ చేయదు.

3. పిండి పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి. బాగా ఉడికిన అన్నం, పప్పు అన్నిటికంటే మంచిది.

4. పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారంలో ఫ్యాట్‌ ఎక్కువుగా ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో పుదీనా తీసుకుంటే అజీర్తి సమస్య ఉండదు.

5. పుదీనారసం ఎండ తాపాన్ని తగ్గిస్తుంది. ఎండకాలం లో రోజుకో గ్లాసు పుదీనారసం తాగితే శరీర ఉష్ణోగ్రత వాతావరణానికి అనుకూలంగా సమన్వయమవుతుంది. ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ రోజుల్లో పిల్లలకు పుదీనా రసాన్ని ఇస్తుంటే వడదెబ్బ తగలదు.

6. పైత్యం, ఆ కారణంగా తలతిప్పటం వంటి సమస్యలున్నప్పుడు జీలకర్రను మెత్తగా గ్రైండ్‌ చేసి ఆ పేస్ట్‌ను నీటిలో కలిపి తాగాలి. ఇలా రెండు రోజుల పాటు రోజుకు రెండుసార్లు చేయాలి.

7. పొట్టకి సంబంధించిన పలు సమస్యలకు వెల్లుల్లి మంచి మందు, ఒకటి రెండు రెబ్బల వెల్లుల్లిని మెత్తగా నూరి ఆ రసాన్ని అరకప్పు నీటిలో కలిపి తాగాలి. దీని వల్ల అరుగుదల, పొట్టలో పురుగులు నశించటం, శరీరంలోని విష పదార్ధాలు నశించటం, కొలెస్ట్రాల్ నియంత్రణ, తక్కువ స్థాయిలో ఉన్న విరేచనాలు తగ్గుతాయి.

8. పొద్దున లేవగానే ఖాళీ కడుపుతో యాపిల్ పండు తింటే తలనొప్పి సమస్య తొందరగా తలెత్తదు.

9. ప్రతీరోజూ రెండుసార్లు తప్పనిసరిగా బ్రష్‌ చేసుకోవాలి. ఏదైనా తిన్న ప్రతీసారీ ఆహారం తాలుకా అవశేషాలు నోట్లో మిగలకుండా మంచి నీటితో పుక్కిలించాలి.

10. ప్రతీరోజు ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక్కొక్కటి నాలుగైదు చొప్పున తులసి, వేపఆకులను, ఐదారు మిరియాలను వేసి మరిగించి తాగాలి. (హై బిపితో బాధపడుతన్న వాళ్లు మినహాయించాలి).

11. ప్రతీరోజు ఉదయం సాయంత్రం ముప్పావుగంట నడక డయాబెటిస్‌ను అదుపులోకి తెస్తుంది.

12. ప్రతి రోజు అల్లంతో చేసిన టీని తాగుతుంటే జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపులో మంట మొదలైన పొట్టకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.

13. ప్రతిరోజు గోధుమ జావ తాగితే బీపీ ఉన్నవారికి మంచిది.

14. ఫేషియల్‌ ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల ముడతలను సమర్ధంగా నివారించవచ్చు. హాయిగా నవ్వేవాళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగానే కాక అందంగాకూడా కనిపిస్తారు. వార్ధక్యం వీరిదరి చేరదా? అనిపించేలా ఉంటారు. నవ్వడం వల్ల ముఖములోని కండరాలకు ఎక్సర్‌సైజ్‌ అంది రక్తప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం పటుత్వంతో ఉంటుంది. కాబట్టి ముడతలు పడవు.

15. పెరిగే పిల్లలకు సోయాబీన్ మంచి పోషణని ఇస్తుంది. దేహదారుఢ్యానికి, పెరుగుదలకు దోహదం చేస్తుంది. శరీరం పెరుగుదలతో పాటు మెదడును వికసింపచేస్తుంది.

16. బరువు తగ్గాలనుకునేవాళ్లు అనుకున్నదే తడవుగా ఆహారనియమాలు, వ్యాయామాలు మొదలు పెట్టటం జరుగుతుంది. సాధారణంగా ఉండాల్సిన బరువుకంటే అదనంగా ఎన్ని కిలోలు ఉన్నారు? అంటే ఎంత బరువు తగ్గితే సరిపోతుంది? ఎంత సమయం తీసుకోవాలి అన్న విషయంపై స్పష్టత వచ్చాక నియమాలను పాటించటం మొదలు పెట్టాలి. ఇందుకోసం అవసరమైతే నిపుణుల సలహ తీసుకోవటం మంచిది.

17. బరువు తగ్గాలనుకున్న వాళ్లు రోజువారీ ఆహారంలో కనీసం ఐదుసార్లు పచ్చికూరగాయలు, పండ్లు తీసుకోవాలి. వాటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ సమృద్ధిగానూ కేలరీలు తక్కువుగా వుంటాయి.

18. భరించరానంత తలనొప్పి తగ్గాలంటే పది తులసి ఆకులు, పది నల్ల మిరియాలను నూరి అందులో టీ స్పూను తేనె కలిపి రోజుకు మూడు సార్లు తినాలి.

19. బాదం పప్పు, గసగసాలు కలిపి తింటే రక్తం శుద్దియగును.

20. బాగా నమిలి తినాల్సిన ఆహారాన్ని తీసుకునే వారిలో కూడా చర్మం త్వరగా ముడతలు పడకపోవడాన్ని చూస్తుంటాం. ఎక్కువ సేపు నమలడం ద్వారా ముఖంలోని కండరాలు శ్రమిస్తాయి. చర్మపు మెటబాలిజమ్‌ మెరుగవుతుంది. కాబట్టి ముడతలు పడవు.

21. బెల్లం లో మిరియాల పొడి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని నిద్రించే ముందు తీసుకుంటే జలుబు తగ్గుతుంది.

22. బొప్పాకాయను కానీ, ఆకుని కానీ మెత్తగా కాటుకలా నూరి ఆ ముద్దని అరికాళ్ళ ఆనెల మీద పెట్టి, కట్టుకడితే అవి మెత్తబడతాయి.

23. మజ్జిగలో కాస్త అల్లం పొడిని, ఉప్పుని కలిపి తీసుకుంటే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి.

24. మజ్జిగలో కొంచెం పసుపు, కాస్త ఉప్పు కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి.

25. మల్బరీ ఆకుని వేడిచేసి వాసన పీలిస్తే దగ్గు తగ్గుతుంది.

26. మానసిక రుగ్మత ఉన్న వాళ్లకు నువ్వులనూనెతో కాని నెయ్యితో కాని తలకు నుదుటిమీద మర్ధన చేయాలి. రాత్రిపూట మర్ధన చేసి, ఉదయాన్నే తలస్నానం చేయాలి.

27. మామిడి గింజల పొడిని నీటిలో కలిపి తాగితే డయేరియా తగ్గుతుంది.

28. మిరియాలతో దగ్గు, జలుబు, గొంతు నొప్పుల నుంచి ఉపశమనం ఇచ్చే మందుని తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాసు మంచినీరు, ఐదు లేక ఆరు మిరియాలు, ఒక ముక్క తెల్ల ఉల్లిపాయ, చితక్కొట్టిన అల్లం ముక్క ఒకటి, చిన్న బెల్లం ముక్క ఇవన్నీ వేసి నీరు సగం అయ్యేంత వరకు కాచండి. వేడిగా ఉండగానె తాగండి. దీనిని సేవించడం వల్ల పైన చెప్పిన చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

29. మూడు టీ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌, రెండు టీ స్పూన్ల యూకలిప్టస్‌ ఆయిల్‌ను షాంపూలో కలుపుకొని తలస్నానం చేస్తే పేలు పోతాయి.

30. మొటిమలు కాని ఒంటిమీద మరెక్కడైనా ఇన్‌ఫెక్షన్ కాని ఉన్నట్లయితే ఒక గుప్పెడు లేత వేపాకులలో చిటికెడు పసుపు కలిపి గ్రైండ్ చేసి సమస్య ఉన్నచోట రాయాలి. కనీసం వారానికి ఒకసారయినా ఇదే మిశ్రమాన్ని ఐదు గ్రాముల చొప్పున కడుపులోకి తీసుకుంటే జీర్ణవ్యవస్ధలో ఇన్‌ఫెక్షన్‌ను అరికడుతుంది.

31. మిరియాలు మంచి ఘాటు వాసనను కలిగి ఉంటాయి. ఈ కారణంగానే వీటిని మసాజ్ ఆయిల్ తయారీలో ఒక పదార్థంగా ఉపయోగిస్తారు. ఈ ఆయిల్‌తో మర్థనా చేసుకోవడం లేదా కొన్ని చుక్కలు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కండరాల నొప్పులు, మామూలు నొప్పులు, గాయాలనుండి రసికారడాన్ని అరికట్టడంలో ఎంతో ప్రతిభావంతంగా పని చేస్తుంది.


సూచన : మా ఈ వెబ్ సైట్ ద్వారా ఎన్నొ రకల మంచి విషయలను ఒకేచొట ప్రజలకు అందచేయలన్న సదుద్దేశ్యం తొ మాకు తెలిసిన, ఎందరో మహనుభవుల నుంచి తెలుసుకన్న, వివిధ రకల గ్రంధముల నుంచి సేకరించిన వివరాలను మీకు అందించటం జరిగింది. మాకు తెలిసిన వివరాలను సాధ్యమైనంత జాగ్రత్తగా పర్యవెక్షించి ఉంచుతున్నము, కాని ఇంకా ఎమైన కొత్త విషయలు చెర్చాలి అన్న, లెక ఉన్నవాటిలొ ఎమైన మార్పులు చెయాలి అన్న , మీ వ్యాఖ్యలు మేము గౌరవిస్తాము. మా "సంప్రదించండి" లింక్ ద్వారా వివరాలను తెలియచేయండి.

Ad Banner