getapujari.com logo
vinayakudu
narasimhaswamy
థి గ్రేట్ సప్తర్షి రిసేర్చింగ్ టీం | ఎవరితో ఎలా మాట్లాడాలి? | 56 అక్షరాల అక్షరమాల కవిత | గోవు వర్ణన | గరుడ గమన తవ చరణకమలమిహ | శ్రీ కృష్ణుని మేలుకొలుపు | మన పల్లె జీవనం - మన పల్లె సోయగం | శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా? | ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు | నక్షత్ర మంత్రాలు | శ్రీశైల రగడ (శ్రీశైల మానసిక యాత్ర) | దర్భ యొక్క ప్రాముఖ్యం | మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు? | ఏక వింశతి పత్రాలు | శ్రీ గురు రామాయణ సుధ
శ్రీ కృష్ణుని మేలుకొలుపు << బాక్
kesavaa ani ninnu vaasiga

కేశవా అని నిన్ను వాసిగ భక్తులు వర్ణింపు చున్నారు మేలుకో
వాసవ వందిత వసుదేవ నందన, వైకుంఠ వాసుడ మేలుకో |కృష్ణా - మేలుకో|

నారాయణా యని నిన్ను నమ్మిన భక్తుల కరుణ బ్రోతువు వేగ మేలుకో
శరణన్న రక్షణ బిరుదు నీకున్నది శశిధర సన్నుత మేలుకో |కృష్ణా - మేలుకో|

మాధవా యని నిన్ను యాదవులందరు మమత జెందున్నారు మేలుకో
చల్లని చూపుల తెల్లని నామము నల్లని నా స్వామి మేలుకో |కృష్ణా - మేలుకో|

గోవిందా యని నిన్ను గొపికలందరు గొల్లవాడందరు మేలుకో
గోపీమనోహర గోవర్దనోద్ధార గోపాల బాలుడ మేలుకో |కృష్ణా - మేలుకో|

విష్ణురూపముదాల్చి విభవము దర్శించు విష్ణు స్వరూపుడ మేలుకో
దుష్ట సంహారక దురితము లెడబాపు సృష్టి సమ్రక్షక మేలుకో |కృష్ణా - మేలుకో|

మధుసూదనా నీవు మగువతోడుత గూడి మరచి నిద్రించేవు మేలుకో
ఉదయార్క బింబము ఉదయించు వేళాయె వనరుహలోచన మేలుకో |కృష్ణా - మేలుకో|

త్రివిక్రమాయని శక్రాదులందరు విక్రమ మందురు మేలుకో
శుక్రాదిగ్రహములు నీ సుందర రూపము చూడగోరుచున్నారు మేలుకో |కృష్ణా - మేలుకో|

వామన రూపమున భూదాన మడిగిన పుండరీకాక్షుడ మేలుకో
బలిని నీ పాదమున బంధన జేసిన కశ్యప నందన మేలుకో |కృష్ణా - మేలుకో|

శ్రీధర గోవింద రాధా మనొహర యాదవకుల తిలక మేలుకో
రాధావధూమణి రాజిల్క పంపింది పొడ జూతువుగాని మేలుకో |కృష్ణా - మేలుకో|

హృషికేశ భువియందు ఋషులందరు వచ్చి కూర్చున్నారు మేలుకో
వచ్చిన వారికి వరములు కావలె వైకుంఠ వాసుడే మేలుకో |కృష్ణా - మేలుకో|

పద్మనాభా నీదు పత్ని భార్యాదులు వచ్చి కూర్చున్నారు మేలుకో
పరమతారకమైన నీదు పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో |కృష్ణా - మేలుకో|

దామోదరాయని దేవతలందరు దర్శింప వచ్చిరి మేలుకో
భూమి భారము మనుప ఋదుల బ్ర్రొవగ రావ భూకాంత రమణుడ మేలుకో |కృష్ణా - మేలుకో|

సంకర్షణా నీవు శత్రు సమ్హరము సేయ సమయమై యున్నది మేలుకో
పంకజాక్షులు నీదు పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో |కృష్ణా - మేలుకో|

వాసుదేవా నీకు భూసుర పత్నులు భుజియింప దెచ్చిరి మేలుకో
భూసురంబుగ యాగ సమ్రక్షణ కొరకు వర్ణింపు చున్నారు మేలుకో |కృష్ణా - మేలుకో|

ప్రద్యుమ్నరూపుడ అర్జున వరదుడ దుర్జన సం హర మేలుకో
అబ్జవంశము నందు ఉద్భవించిన కుబ్జ నాదరించిన దేవ మేలుకో |కృష్ణా - మేలుకో|

అనిరుద్దా యని నిన్ను అబ్జ భవాదులు అనుసరింప వచ్చె మేలుకో
అండజ వాహన అబ్జ సమ్హరణ దర్భ శయన వేగ మేలుకో |కృష్ణా - మేలుకో|

పురుషోత్తమా యని పుణ్యాంగనలందరు పూజలు చేతురు మేలుకో
పురుహూత వందిత పురహర మిత్రుడ పూతన సమ్హర మేలుకో |కృష్ణా - మేలుకో|

అధొక్షజా మిమ్ము స్మరణ జేసిన వారి దురితము లెడ బాప మేలుకో
వరుస తోడుత మిమ్ము స్మరణ చేయు వారికి వందన మొసగెద మేలుకో |కృష్ణా - మేలుకో|

నారశిమ్హా నిన్ను నమ్మిన భక్తుల కరుణ బ్రొతువు వేగ మేలుకో
శరణన్న రక్షణ బిరుదు నికున్నది శశిధర సన్నుత మేలుకో |కృష్ణా - మేలుకో|

అచ్యుతా యని నిన్ను విప్రవరులంత కొనియాడవచ్చిరి మేలుకో
పచ్చని చేలములు అచ్చంగ దాల్చిన లక్ష్మీ మనోహర మేల్లుకో |కృష్ణా - మేలుకో|

జనార్ధనా నీవు శతృసంహరముసేయ సమయమై యున్నది మేలుకో
పంకజాక్షులు నీదు పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో |కృష్ణా - మేలుకో|

ఉపేంద్రా యని నిన్ను యుయలందరు గూడి యమునా తీరమందున్నారు మేలుకో
గోపకాంతలు మిమ్ము రాగోరుచున్నారు మురళీనాద వినోద మేలుకో |కృష్ణా - మేలుకో|

హరి హరి యని నిన్ను కొనియాడ గోపిక జనులంత వచ్చిరి మేలుకో
అష్టభార్యలు మిమ్ము రాగోరుచున్నారు వనమాలికాధర మేలుకో |కృష్ణా - మేలుకో|

శ్రీకృష్ణా యని నిన్ను గోపబాలురు బంతులు ఆడగ వచ్చిరి మేలుకో
కాళింది మర్ధన కంస సమ్హర కౌస్తుభమణిధర మేలుకో |కృష్ణా - మేలుకో|

శ్రీరామా యని నిన్ను స్థిరభక్తితొ మునులు సేవింపు చున్నారు మేలుకో
తాటక సమ్హర ఖరదూషణాంతక కాకుత్సకుల తిలక మేలుకో |కృష్ణా - మేలుకో|

తెలవార వచ్చె దిక్కులు తెలుపొందె నల్లని నా స్వామి మేలుకో
గోవుల మందకు పొవు వేళాయె గోపాల బాలుడ మేలుకో |కృష్ణా - మేలుకో|


సూచన : మా ఈ వెబ్ సైట్ ద్వారా ఎన్నొ రకల మంచి విషయలను ఒకేచొట ప్రజలకు అందచేయలన్న సదుద్దేశ్యం తొ మాకు తెలిసిన, ఎందరో మహనుభవుల నుంచి తెలుసుకన్న, వివిధ రకల గ్రంధముల నుంచి సేకరించిన వివరాలను మీకు అందించటం జరిగింది. మాకు తెలిసిన వివరాలను సాధ్యమైనంత జాగ్రత్తగా పర్యవెక్షించి ఉంచుతున్నము, కాని ఇంకా ఎమైన కొత్త విషయలు చెర్చాలి అన్న, లెక ఉన్నవాటిలొ ఎమైన మార్పులు చెయాలి అన్న , మీ వ్యాఖ్యలు మేము గౌరవిస్తాము. మా "సంప్రదించండి" లింక్ ద్వారా వివరాలను తెలియచేయండి.

Ad Banner