getapujari.com logo
vinayakudu
narasimhaswamy
థి గ్రేట్ సప్తర్షి రిసేర్చింగ్ టీం | ఎవరితో ఎలా మాట్లాడాలి? | 56 అక్షరాల అక్షరమాల కవిత | గోవు వర్ణన | గరుడ గమన తవ చరణకమలమిహ | శ్రీ కృష్ణుని మేలుకొలుపు | మన పల్లె జీవనం - మన పల్లె సోయగం | శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా? | ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు | నక్షత్ర మంత్రాలు | శ్రీశైల రగడ (శ్రీశైల మానసిక యాత్ర) | దర్భ యొక్క ప్రాముఖ్యం | మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు? | ఏక వింశతి పత్రాలు | శ్రీ గురు రామాయణ సుధ
గోవు వర్ణన << బాక్
govu varnana పాడినవారు: జంపని వెంకట లక్ష్మి గారు

గోవు పాదములు పిత్రుదేవతలు, గొలుసులు తులసిదళములు, భుజములు మొపేచెక్కలు మొపేమర్గములు, కైవరమున చెక్రములుండును, దంత మాత్రమున దేవతలుండును. నొరు లొకేశ్వరము, నాలిక నారయణము, ముక్కు శిలాదేవి, కళ్ళు ఉగ్ర దేవాతలు, చెవులు శంఖునాదములు, నొసలు పార్వతి పరమేశ్వరులు, కొమ్ములు గొవిందరాజులు, పక్కలు పర్వతాలు, పిక్కలు పిడిగంటలు, డెక్కలు దేవగణములు, మొపురమున గొపల స్వామి, కాళ్ళు గరుడ స్తంభాలు, తొక వింజామర, పొట్ట బొడ్డు పొన్నపువ్వు, పాదము పుండరికాక్షయ పురుషొత్తములు, సళ్ళు సప్తమహా ఋషులు, పాలు పంచామ్రుతాలు, పంచితం భావిచ గంగ, గోమయం శ్రి మహాలక్ష్మి భక్తురాలు, గొవు రొమములు అన్ని లింగములె, గోవు ఉండె స్తలం సప్త సాగరము.

రాములవారి భార్య సీత దేవి, ఈశ్వరుని భార్య పార్వతి దేవి, బ్రహ్మ భార్య సరస్వతి దేవి, రుక్మిణి, సత్య భామ వీరు ఐదుగురు కొలువై కూర్చోని ఉండగ, ఆడవారు చెసిన పాపం ఏవిధంగా పోవును క్రిష్ణ అంటె? గోవు వర్నించినా పఠించినా, ముట్టు కలిపిన పాపం పోవును, అంటు కలిపిన పాపం పోవును, పతిని ఎదురులడిన పాపం పోవును, బంతిని ఏదానం చేసిన పాపం పోవును, ఇటువంటి పాపములు అన్నియు పొవును శ్రీ క్రిష్ణ, ఇంకా ఎమి కోరవచ్హెను శ్రీ మహలక్ష్మి భక్తురాలు?

తన పురుషుడు తనకు పంపగా, తన పుత్రుడు తనకు పంపగా, పొయిన చొటనే పూజించి, పూజించిన చొటనే ఎత్తించి, ఎత్తించిన చొటనే అలికించి, అలికించిన చొటనే మణిక్యాల ముగ్గులు పెట్టించి, మకర తొరణాలు కట్టించి, రత్నల రంగవల్లి కావించి,కాలై పొయిన వాళ్ళను కడత్రొయించి, పేలై పొయినవళ్ళను పెడత్రొయించి, ఇనప ముక్కు కాకులను ఎదిరించుకొని, కండ్ర కుక్కలను ఎదిరించుకొని, దెవతా వస్త్రాలను ధరించుకొని వస్తిని దేవ, ఇంకా ఏమి కోరవచ్హెను శ్రీ మహలక్ష్మి భక్తురాలు?.

తానును, తన తల్లిని, తల్లి తల్లిని, మూడు తొటల పువ్వులు ముడుచుకొని, ఆరు తొటల కందబలం భక్షించి, చాల ఇదవతనం కలవర్తిందేవ, ఇంక ఎమి కొరవచ్హెను శ్రి మహలక్ష్మి భక్తురాలు?, తనకు, తన అత్తగారును, అత్తగారు అత్తగారును, మూడు తొటల పువ్వులు ముదుచుకొని, ఆరు తొటల కందబలం భక్షించి, చాల ఇదవ తనం కలవర్తిందెవ, ఇంకా ఏమి కొరవచ్హెను శ్రీ మహలక్ష్మి భక్తురాలు?.

రొజుకు ఆరు పుట్ల రాజనాలు చెల్లెలు గర్తిందెవ, ముడు పుట్ల బియ్యం చెల్లెలు గర్తిందెవ, పుట్టెడు పప్పు చెల్లెలు గర్తిందెవ, ముప్పందుము నెయ్యి చెల్లెలు గర్తిందెవ, అర్ధ మణుగు ఇంగువ చెల్లెలు గర్తిందెవ, మణుగు పసుపు చెల్లెలు గర్తిందెవ, అర్ధ మనుగు కుంకుమ చెల్లెలు గర్తిందెవ, ఇంకా ఏమి కొరవచ్హెను శ్రీ మహలక్ష్మి భక్తురాలు?.

పాడి ఆవును తెచ్చి పందిట్లొ పెట్టి అమ్మా గొదానం చెసుకొమనే వాడే కొడుకు, చిన్నరి పాలికలు తెచ్చి పళ్ళెంలొ పొసి, అమ్మా సువర్ణ దానం చెసుకొమనే వాడే కొడుకు, సన్న బియ్యం ఛాయ పప్పు తెచ్హి, చాప మీద పొసి అమ్మా అన్న దానం చెసుకొమనే వడే కొడుకు, పట్టు వస్త్రాలు తెచ్హి పెట్టెలొ పెట్టి అమ్మా వస్త్ర దానం చెసుకొమనే వాడే కొడుకు, తూరుపున దుర్గం ఏలే వాడే కొద్డుకు, పడమర భారతం చదివెవాడే కొద్డుకు, ఉత్తరమున ఉళ్ళు ఏలే వాడే కొద్డుకు, దక్షిణమున అన్న సత్రములు కట్టించెవాడే కొడుకు, ఆడె వాడే కొడుకు, దేకే వాడే కొడుకు,పాకే వాడే కొడుకు, ఇటువంత్టి పుత్రులు కలవర్థిందెవ, ఇంకా ఎమి కొరవచ్హెను శ్రీ మహలక్ష్మి భక్తురాలు?.

సీత దేవిని పోలు ఒక కూతురు, పార్వతీ దేవిని పోలు ఒక కూతురు, రాముల వారిని పోలు ఒక అల్లుడు, సంబ మూర్తి ని పోలు ఒక అల్లుడు, ఇట్టి కూతుళ్ళు, ఇట్టి అల్లుళ్ళు కలవర్తిందేవ, ఇంకా ఎమి కొరవచ్హెను శ్రీ మహలక్ష్మి భక్తురాలు?.

గయా గయా పొయి వస్తిని, కాశీ విశ్వేశ్వరుడు, అన్నపుర్ణమ్మను, కాల భైరవస్వామిని సేవించుకొని వస్తిని, అందుచె పలం కలదంటె కన్యా ప్రదానం, గురు ప్రదక్షిణం, సముద్ర ప్రదక్షిణం, అశ్వద్థ నారయణ మూర్తి ప్రదక్షిణం చేసినంత ఫలితం, ఇంకా ఎమి కోరవచ్హెను శ్రీ మహలక్ష్మి భక్తురాలు?.

ప్రతహ్ కలం పఠించుకుంటె పంచనదులలొ స్నానం చేసినంత ఫలితం, మధ్యహ్న కలం పఠించుకుంటె సహస్ర బ్రహ్మణులకు అన్నదానం చేసినంత ఫలితం, సయంకలం పఠించుకుంటె, చాల ఐదవతనం, రాత్రి కాలం పఠించుకుంటె అగ్ని భయం, చొరభయం, సర్వ భయం ఉండదు, క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ..


సూచన : మా ఈ వెబ్ సైట్ ద్వారా ఎన్నొ రకల మంచి విషయలను ఒకేచొట ప్రజలకు అందచేయలన్న సదుద్దేశ్యం తొ మాకు తెలిసిన, ఎందరో మహనుభవుల నుంచి తెలుసుకన్న, వివిధ రకల గ్రంధముల నుంచి సేకరించిన వివరాలను మీకు అందించటం జరిగింది. మాకు తెలిసిన వివరాలను సాధ్యమైనంత జాగ్రత్తగా పర్యవెక్షించి ఉంచుతున్నము, కాని ఇంకా ఎమైన కొత్త విషయలు చెర్చాలి అన్న, లెక ఉన్నవాటిలొ ఎమైన మార్పులు చెయాలి అన్న , మీ వ్యాఖ్యలు మేము గౌరవిస్తాము. మా "సంప్రదించండి" లింక్ ద్వారా వివరాలను తెలియచేయండి.

Ad Banner